Home  »  Featured Articles  »  రాజబాబు మానవత్వానికి కంటతటి పెట్టుకున్న పద్మనాభం!

Updated : Apr 6, 2026

నవరసాల్లో ఏది ఇష్టపడకపోయినా హాస్యాన్ని ఆస్వాదించనివారు ఎవ్వరూ ఉండరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హాస్యానికి ఆదరణ అనేది ఎప్పటికీ ఉంటుంది. అంతేకాదు, హాస్యాన్ని పండించిన నటీనటులు నవరసాల్లోని ఏ రసాన్నయినా అద్భుతంగా అభినయించగలరు అనేది జగమెరిగిన సత్యం. హాస్యనటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగిన నటుడు రాజబాబు. అలాగే విషాదం నిండిన పాత్రలను కూడా ఆయన ఎంతో సమర్థవంతంగా పోషించేవారు.

నటుడిగా స్థిరపడేందుకు రాజబాబు ఎన్నో కష్టాలను అనుభవించారు. 1960లో వచ్చిన ‘సమాజం’ చిత్రంతో నటుడిగా పరిచయమైన రాజబాబు.. 20 సంవత్సరాల కెరీర్‌లో 600కిపైగా సినిమాల్లో నటించారు. ఒక దశలో రాజబాబు లేని సినిమా ఉండేది కాదు. ఆరోజుల్లో రాజబాబు, రమాప్రభ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉండేది. కమెడియన్‌గా మంచి పేరు, డబ్బు సంపాదించిన రాజబాబుకి దాన గుణం చాలా ఎక్కువ. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున తనకంటే సీనియర్ కమెడియన్స్‌ని సత్కరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అలాగే రాజమండ్రిలోని పారిశుధ్య కార్మికుల కోసం అదే ఊరిలో భూమి ఇచ్చారు. కోరుకొండలో జూనియర్ కళాశాలను కట్టించారు. అంతేకాదు, ఎన్నో సంస్థలకు విరాళాలిచ్చారు. 

తను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును దాన ధర్మాలకే ఉపయోగించారు రాజబాబు. అయితే ఒక దశలో సొంతంగా సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. కొన్ని సినిమాలు లాభాలు తెచ్చిపెట్టినా, ఎక్కువ శాతం పరాజయాన్ని చవిచూశాయి. దాంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అదే సమయంలో పద్మనాభం కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. పద్మనాభం నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా కోసం ర్పుాబాబు దగ్గర అప్ప్పు చెయ్యాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కూడా సినిమాల వల్లే నష్టపోయారు. 

సినిమాల్లో అవకాశాలు తగ్గడం, నిర్మాతగా కూడా నష్టాలు రావడంతో రాజబాబుకి కొంత డబ్బు అవసరం పడింది. ఆ సమయంలో పద్మనాభం దగ్గరకు వెళ్లి తనకు ఇవ్వాల్సిన డబ్బు గురించి అడిగారు ర్పుాబాబు. అప్పటికే పద్మనాభం సినిమాల కోసం తన ఆస్తులను కూడా అమ్మేశారు. అయినప్పటికీ రాజబాబుకి ఇవ్వాల్సిన డబ్బు కోసం తన పేరు మీద ఉన్న ఓ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ రాజబాబుకి ఇచ్చి, దాన్ని తాకట్టుపెట్టి డబ్బు తీసుకోమని చెప్పారు ప‌ద్మ‌నాభం. 

అంత కష్టంలోనూ తన మానవత్వాన్ని మర్చిపోలేదు రాజబాబు. అలా తాకట్టుపెట్టి డబ్బు తీసుకోవడానికి ఆయ‌న ఇష్టపడలేదు. ‘నీ ఆస్తిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకునే స్థితికి నేను దిగజారలేదు. నీ దగ్గర ఉన్నప్ప్పుడే ఇవ్వు అన్నయ్యా’ అంటూ ఎంతో సున్నితంగా చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు రాజబాబు. తను కష్టాల్లో ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తికి రాజబాబు ఇచ్చిన గౌరవాన్ని చూసి పద్మనాభం కంటతడి పెట్టుకున్నారు. అంతటి మానవత్వం కలిగిన కమెడియన్ ఇండస్ట్రీలో ఉన్నందుకు ఎంతో గర్వపడ్డారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.